తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైదీలపై కరోనా ఎఫెక్ట్​: ములాఖాత్​లు బంద్.. - వరంగల్​ కేంద్ర కారాగారం

కరోనా ప్రభావం జైలు ఖైదీలపై కూడా పడింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఖైదీలను చూడడానికి వచ్చేవారికి ములాఖాత్​ను రద్దు చేస్తున్నట్టు వరంగల్​ కేంద్ర కారాగార సూపరింటెండెంట్​ మురళిబాబు తెలిపారు.

Corona Effect Government cancelled visit to Prisoners to at Warangal jail
ఖైదీలపై కరోనా ఎఫెక్ట్​: ములాఖాత్​లు బంద్..

By

Published : Mar 21, 2020, 8:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ అర్బన్​ జిల్లాలోని కేంద్ర కారాగారంలో ఖైదీలను చూసేందుకు వెసులు బాటు కల్పించే ములాఖాత్ రద్దు చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ మురళిబాబు తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. జైలు ప్రధాన గేటు వద్ద ములాఖాత్ లేదంటూ బోర్డును ఏర్పాటు చేశారు. తదుపరి ఉత్తర్వులు అనంతరం ములాఖాత్ దక్కుతుందని మురళిబాబు తెలిపారు.

ఖైదీలపై కరోనా ఎఫెక్ట్​: ములాఖాత్​లు బంద్..

ABOUT THE AUTHOR

...view details