వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో 31 కేసులు నమోదు కాగా గ్రామీణ జిల్లాలో ఐదు కేసులు, జనగామలో మూడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా పంజా.. ఓరుగల్లులో ఒక్కరోజే 43 కేసులు - ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు
ఉమ్మడి వరంగల్ జిల్లాపై కొవిడ్-19 పంజా విసిరింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 43 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
Corona cases Update in Joint Warangal district
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని వీధులను ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తున్నారు.