తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎంలో పెరుగుతున్న కరోనా కేసులు - CORONA AT MGM Hospital in Warangal urban district

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనుమానితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

CORONA AT MGM Hospital in Warangal urban district
ఎంజీఎంలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Mar 24, 2020, 8:31 PM IST

ఉత్తర తెలంగాణకు తలమానికమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి కరోనా వ్యాధి లక్షణాల అనుమానితులను ఆస్పత్రి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వారి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదని ఎంజీఎం ఆస్పత్రి కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఎంజీఎంలో పెరుగుతున్న కరోనా కేసులు

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ABOUT THE AUTHOR

...view details