తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపే సహకార సంఘాల ఎన్నికలు - Cooperative Society Elections In Telangana

రేపు జరగబోయే వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దర్గాకాజీపేట, ధర్మసాగర్ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తమ సామగ్రితో తరలివెళ్లారు.

Cooperative Society Elections
సహకార సంఘం ఎన్నికలు

By

Published : Feb 14, 2020, 7:41 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని దర్గాకాజీపేట, ధర్మసాగర్ సహకార సంఘాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్రాలకు సిబ్బంది తమ సామగ్రితో చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనుండగా... సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ధర్మసాగర్ మండల కేంద్రానికి సంబంధించి 13 స్థానాలకు గాను 5 స్థానాలు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం చేసుకోగా... మరో 8 స్థానాలకు పోటీ జరుగుతుంది.

కాజీపేట్ మండల కేంద్రానికి సంబంధించి 13 స్థానాలకు గాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా... మరో పది స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు.

సహకార సంఘం ఎన్నికలు

ఇదీ చూడండి:మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details