రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల మూల సూత్రాలకే ముప్పు తెచ్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో పోరాడాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యార్డుకు తరలించడం విచారకరమని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉంది : కడియం - basic principles
ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని, దాని నిర్మాతను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ యార్డుకు తరలించడాన్ని ఖండిస్తున్నాం : కడియం