గ్రేటర్ వరంగల్‌లో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. సమయం తక్కువగా ఉండటంతో... అభ్యర్ధులు ప్రచారం జోరు పెంచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ... తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు వరంగల్‌లో ప్రచారం నిర్వహించారు.
'దేశ ప్రజలకు వ్యాక్సిన్ లేకుండా... విదేశాలకు పంపించారు' - వరంగల్‌లో కాంగ్రెస్ నేతలు
మోదీ మాటలు ఎక్కువ చెప్పి... పని తక్కువ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఉంచకుండా... విదేశాలకు పంపించారంటూ ఆరోపించారు.
'దేశ ప్రజలకు వ్యాక్సిన్ లేకుండా... విదేశాలకు పంపించారు'
ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో తెరాస, భాజపా వైఫల్యం చెందాయని వీహెచ్ విమర్శించారు. మోదీ మాటలు ఎక్కువ చెప్పి పని తక్కువ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ లేకుండా చేసి.. విదేశాలకు పంపించారని ఆరోపించారు. కేసీఆర్ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కరోనా వంటి ఆపదకాలంలో నిరుపేదలకు సరుకుల కొనుగోలుకు రూ.6 వేలు అందించాలని సూచించారు.
ఇదీ చూడండి:స్పూర్తి: కరోనాను ఎదిరించి సేవలు.. దేశం పలుకుతోంది జేజేలు..