పట్టభద్రుల్లో తెరాస, భాజపాలపై వ్యతిరేకత బాగా కనపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్ అన్నారు. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి రాములు నాయక్ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ మైదానంలో ఆదివారం ఉదయం ప్రచారం నిర్వహించారు. వాకర్లను కలిసి ఓట్లను అభ్యర్ధించారు.
సమస్యలపై ప్రశ్నించే గళం మాదే: వీహెచ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, నేతలు ప్రధానంగా ఉదయపు నడక చేసేవారిని కలుసుకుని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీనియర్ నేత వి. హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్.. వరంగల్ జేఎన్ఎస్ మైదానంలో ప్రచారం నిర్వహించారు.
వరంగల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
సమస్యలపై ప్రశ్నించే గళం తమదేనని వీహెచ్ అన్నారు. ఉన్న ఉద్యోగాలే భర్తీ చేయకుండా... కొత్త ఉద్యోగాల పేరుతో మరోసారి సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం మైదానంలోనే అందరితో కలిసి వీహెచ్ చిన్నపాటి కసరత్తులు చేశారు.