దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రహదారిపై పూలను వేస్తూ ఆ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
'రోడ్లను మరమ్మతులు చేయండి' - రోడ్లను మరమ్మతులు చేయండి
స్మార్ట్ సిటీగా మారినప్పటికీ వరంగల్లోని రహదారులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని నిరసన వ్యక్తం చేశారు.
'రోడ్లను మరమ్మతులు చేయండి'
స్మార్ట్ సిటీగా రూపు చెందినప్పటికీ నగరంలోని రహదారులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని అని ఎద్దేవా చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ వెంటనే దీనిపై స్పందించి రోడ్ల మరమ్మతులు చేయలేని పక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇవీ చూడండి:మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం