కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో ఇంటి కిరాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని చెప్పడం బాధగా ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి: కాంగ్రెస్ - congress protest in warangal
ఎల్ఆర్ఎస్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
congress protest against LRS in warangal
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సచివాలయం నిర్మాణం కోసం ఎల్ఆర్ఎస్ ఫీజును పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు.