కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. .వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతుల నడ్డి విరిచేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్పొరేట్ వ్యవస్థలకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టి అన్నదాత పొట్టకొడుతోందని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. హన్మకొండలో పార్టీ కార్యాలయం ఎదుట వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
అసలే పండించిన పంటలకు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. వ్యవసాయ బిల్లు ప్రవేశ పెట్టి రైతుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.