గడిచిన ఆరేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపుతోనే ఉద్యోగులు తమ హక్కులను సాధించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై సీఎం కేసీఆర్ చర్చించారని విమర్శించారు. నగరంలోని అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు.
ఓటమి భయంతోనే ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ: కాంగ్రెస్ - కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
వరంగల్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు హోరెత్తాయి. చివరి రోజు కావడంతో ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపుతోనే ఉద్యోగుల హక్కులను సాధించుకోవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఓటమి భయంతోనే ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ: కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని పట్టభద్రులను కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు. బ్యాలెట్ పత్రంలో నాల్గో నంబర్ గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి:పెరుగుతున్న కేసులు.. ఒక్కరోజే 23 వేల మందికి కరోనా