తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెరిగిన ఇందన ధరలతో సామాన్యులపై పెనుభారం'

పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ వరంగల్​ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులపై పెనుభారం మోపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress leaders protests in Warangal.. have raised concerns over rising fuel prices.
'పెరిగిన ఇందన ధరలతో.. సామాన్యులపై పెనుభారం'

By

Published : Mar 2, 2021, 3:53 PM IST

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ.. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపుతోందని వరంగల్​లోని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాశిబుగ్గలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

దిగువ, మధ్య తరగతి ప్రజలను.. కేంద్రం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని స్థితికి దిగజార్చిందని నేతలు విమర్శించారు. ధరలను తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details