పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి: కాంగ్రెస్ - తెలంగాణ వార్తలు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. హన్మకొండలో రోడ్డుపై బైఠాయించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
![పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి: కాంగ్రెస్ congress protest, hanmakond congress protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:19:56:1623390596-tg-wgl-02-11-cong-dharna-ab-ts10077-11062021111446-1106f-1623390286-5.jpg)
కాంగ్రెస్ ధర్నా, హన్మకొండలో కాంగ్రెస్ ధర్నా
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:uttam kumar: నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలు