వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈధర్నాలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, మాజీ మంత్రి కొండాసురేఖ, అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు.
'వ్యవసాయ బిల్లులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి' - congress leaders protest at hanamkonda against the central agri bills
వ్యవసాయ బిల్లులుకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. కేంద్రం వెంటనే బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

'వ్యవసాయ బిల్లులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి'
రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఈ బిల్లులు పూర్తిగా రైతులను, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.