వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజీవ్‌గాంధీ వర్థంతి... నేతల నివాళి - రాజీవ్ గాంధీ వర్థంతికి కాంగ్రెస్ నేతల నివాళి
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్బంగా వరంగల్ హన్మకొండలో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్నికి కొంత మంది మాత్రమే హాజరయ్యారు.
రాజీవ్ గాంధీ వర్థంతికి కాంగ్రెస్ నేతల నివాళి
రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.