తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో కాంగ్రెస్ నేతల బాహాబాహీ - SC CELL CONVENOR EDABOINA PRABHAKAR

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. మరోవైపు కొన్నిచోట్ల నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. వరంగల్​లో కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య ఎన్నికల ప్రచారంలో.. ఇద్దరు నాయకులు ఘర్షణకు దిగారు.

ఘర్షణకు కొండేటి శ్రీధర్​, దిగిన ఎడబోయిన ప్రభాకర్

By

Published : Apr 2, 2019, 10:10 AM IST

Updated : Apr 2, 2019, 5:06 PM IST

గెలిపిస్తే అధిక మొత్తంలో నిధులు తెస్తా : దొమ్మాటి సాంబయ్య
వరంగల్ లోక్​సభ నియోకవర్గ పరిధిలోని కాజీపేట్​లో కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రచారం చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్​తో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఎడబోయిన ప్రభాకర్ ఘర్షణకు దిగారు. శ్రీధర్ ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై నియోజకవర్గంలో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు గొడవను సద్దుమణిగేలా చేశారు.

అనంతరం లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 350 సీట్లు గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దొమ్మటి సాంబయ్య ధీమా వ్యక్తం చేశారు. భాజపా, తెరాస ఒక గూటి పక్షులేనన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

Last Updated : Apr 2, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details