తెలంగాణ

telangana

ETV Bharat / state

రజాకార్ల పాలనను తలపించారు: పొన్నాల లక్ష్మయ్య - ponnala laxmaiah fire on trs government in warangal

హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​పై జరిగిన ఘటన రజాకార్ల పాలనను తలపించిందని కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇంతటి దుర్దినం ఏనాడు చూడలేదని వరంగల్​లో ఆరోపించారు.

పొన్నాల లక్ష్మయ్య

By

Published : Nov 9, 2019, 7:55 PM IST

కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​పై జరిగిన ఘటనపై స్పందించారు. ప్రభుత్వ చర్యలు రజాకార్ల పాలనను తలిపించిందని విమర్శించారు. ఇంతటి దుర్దినం ఏనాడు చూడలేదన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు, గృహనిర్భందాలు చేసినా చలో ట్యాంక్ బండ్‌ విజయవంతం అయిందని తెలిపారు. కోట్ల విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను దక్కించుకోవడానికే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్​ చేశారు.

రజాకార్ల పాలనను తలపించారు: పొన్నాల లక్ష్మయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details