గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తరఫన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వరంగల్ 27వ డివిజన్లో కొండా సురేఖ ప్రచారం - warangal municipal elections news
వరంగల్ బల్దియా ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. 27వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున మాజీ మంత్రి కొండా సురేఖ పర్యటించారు.
![వరంగల్ 27వ డివిజన్లో కొండా సురేఖ ప్రచారం konda surekha campaign in warangal 27th division](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:30:00:1619330400-tg-wgl-15-25-konda-pracharam-av-ts10076-25042021112334-2504f-1619330014-966.jpg)
వరంగల్ 27వ డివిజన్లో కొండా సురేఖ ప్రచారం
గిర్మాజీపేట్లోని గ్రామ దేవతకు సురేఖ ముందుగా పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
ఇదీ చదవండి:గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు