తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ విగ్రహం తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన - warangal congress wing news

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండ టీవీ టవర్​ కాలనీలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మహాత్మాగాంధీ విగ్రహం తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. తొలగించిన ప్రదేశంలోనే పునఃప్రతిష్టించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

గాంధీ విగ్రహం తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
గాంధీ విగ్రహం తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

By

Published : Feb 2, 2021, 8:44 PM IST

మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ వరంగల్​లో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హన్మకొండలోని టీవీ టవర్ కాలనీలో రోడ్డు విస్తరణలో భాగంగా గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ పాల్గొన్నారు.

గాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే పునఃప్రతిష్టించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. విగ్రహం తొలగించి వారం రోజులవుతున్న ఇంతవరకు విగ్రహం పెట్టకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ విగ్రహం తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

ఇదీ చూడండి:క్రైం థ్రిల్లర్: సాయం చేస్తే పెట్రోల్​ పోసి నిప్పంటించాడు!

ABOUT THE AUTHOR

...view details