తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు పోరుకు సర్వం సిద్ధం.. కేంద్రాలకు చేరుకున్న సామగ్రి - Telangana News Updates

గ్రేటర్​ వరంగల్​ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మాస్కు ఉంటేనే ఓటు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 6,63,240 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Warangal Corporation elections latest news
వరంగల్​ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Apr 29, 2021, 10:15 PM IST

కొవిడ్ జాగ్రత్తలతో... రేపటి గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రిని తీసుకువెళ్లిన సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతిక దూరం పాటించేలా...ఏర్పాట్లు చేశారు. విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది కూడా ఫేస్​షీల్డులు, మాస్కులు ధరించి.. పోలింగ్​కు సిద్ధకానున్నారు. పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. వరంగల్ బల్దియా పరిధిలో 66 డివిజన్లకు సంబంధించి 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,63,240 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం 5,125 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1,021 బ్యాలెట్ బ్యాక్సులను ఎన్నికల కోసం సిద్ధం చేశారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్​వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా... 561 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇటు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,700 మంది పోలీసు అధికారులు, సిబ్బంది.... విధుల్లో పాల్గొంటున్నారు. 167 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి.. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ..... పోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు చెప్పారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మే3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరు ఉల్లంగించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో జరగబోయే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏసీపీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details