ఎస్సారెస్పీ కాల్వ గేట్లు తెరుచుకోకపోవడంతో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని గుండ్ల సింగారం, భవాని నగర్, ఇందిరానగర్ కాలనీలు నీటమునిగాయి. కాల్వలో నీటి సామర్థ్యం పెరగడంతో గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా... అవి ఎంతకూ తెరుచుకోకపోవడంతో నీటి ఉద్ధృతి ఎక్కువై కాలనీల్లోకి పోటెత్తింది. కట్టపై ఒత్తిడి పెరిగి బుంగ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేశారు. ట్రాక్టర్లతో మట్టిని తీసుకొచ్చి బుంగను మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరమ్మతులు చేసి ఒక గేటు ఎత్తడంతో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
