ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడత కౌన్సెలింగ్ ప్రకటనను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 26 సాయత్రం 7 గంటల నుంచి 27 సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలన్నారు.
ఈ నెల 26, 27న ఎంబీబీఎస్ తుది విడత వెబ్ ఆప్షన్లు - కాళోజీ యూనివర్సిటీ తాజా వార్తలు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈనెల 26న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ నెల 26, 27న ఎంబీబీఎస్ తుది విడత వెబ్ ఆప్షన్లు
గత విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది చేరని అభ్యర్థులు... కళాశాలలో చేరి హాజరుకాని అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పేర్కొంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో సంప్రదించాలని తెలిపారు.
ఇదీ చూడండి:పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల