వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. రైతు వేదిక భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఆనంతరం కేశవపూర్ నుంచి అంబాలా రహదారి మధ్యలో భారీ వర్షాలకు తెగిన కట్టను పరిశీలించారు. పాక్షికంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్‌ను ఎంపీపీ స్వప్న కోరారు.
రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్ - రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
ఎల్కతుర్తి మండలంలో రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. గుర్తించిన స్థలాల్లో నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్, కోతుల వద్ద రైతు వేదికల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నందున కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తించిన స్థలాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి:ప్రవేశ పరీక్షల వాయిదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఉత్తమ్