తెలంగాణ

telangana

ETV Bharat / state

'బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నాం' - Warangal Urban District Latest News

వరంగల్ అర్బన్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని పోలీస్ పరేడ్​ మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నామని అన్నారు.

Collector Rajiv Gandhi at the unveiling of the national flag
జాతీయ జెండా ఆవిష్కరణలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు

By

Published : Jan 26, 2021, 12:41 PM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నామని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్​ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య సమర యోధులకు, అమరవీరులకు జోహర్లు ఆర్పించారు. కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ధరణి పోర్టల్‌ ద్వారా జిల్లాలో 2,725 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక, ఆగ్నిమాపక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులను కలెక్టర్ సన్మానించారు.

ఇదీ చూడండి:పబ్లిక్ గార్డెన్​లో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details