యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా అక్టోబర్ 4న నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. హన్మకొండలో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ప్రశ్న పత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తనిఖీ చేశారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్ తెలిపారు. 16 కేంద్రాల్లో 6,763 మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ పరీక్షలు ఉదయం సాయంత్రం రెండు సెషన్‌లో నిర్వహించబడుతాయన్నారు.