తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణాలు గడువులోగా పూర్తవ్వాలి: కలెక్టర్​ - warangal latest news

రైతు వేదికల పెండింగ్​ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పాలనాధికారి రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతు వేదికల పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

collector rajeev gandhi hanumanthu review meeting with officials
రైతు వేదికల నిర్మాణాలు గడువులోగా పూర్తవ్వాలి: కలెక్టర్​

By

Published : Oct 20, 2020, 8:03 PM IST

రైతు వేదికల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ అర్బన్​ జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతు వేదిక నిర్మాణ పనుల పురోగతిపై హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రైతు వేదిక నిర్మాణాల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత ఏజెన్సీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదికలతో పాటే మరుగు దొడ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేయాలని సూచించారు.

పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన గడువులోగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్​ సూచించారు. గోడలకు ఇరువైపులా రైతులకు సంబంధించిన పెయింటింగ్​లు వేయాలన్నారు.

ఇదీ చూడండి.. ప్రాజెక్టుల్లో లోపాల వల్లే వరుస ప్రమాదాలు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details