తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​ నగరంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ' - latest news of government chief veep vinayabhaskar

వరంగల్​ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్​విప్​ వినయభాస్కర్​ అన్నారు. హన్మకొండలోని వడ్డేపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు.

'వరంగల్​ నగరంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ'

By

Published : Nov 9, 2019, 7:36 PM IST

వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్​విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని వడ్డేపల్లిలో పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎంపీ దయాకర్​తో కలిసి శంకుస్థాపన చేశారు.

కోటి యాభై లక్షలతో నిర్మిస్తున్న ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తరువాత వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం వరంగల్ నగరానికి బడ్జెట్లో 300 కోట్లు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.

'వరంగల్​ నగరంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ'

ఇదీ చూడండి: మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details