CM KCR Tour Latest News: ఎల్లుండి ఆ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - CM KCR TOUR DETAILS
14:02 November 08
సీఎం కేసీఆర్ పర్యటన
ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM kcr tour latest news) వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. వరంగల్-హనుమకొండ అభివృద్ధిపై(Warangal-Hanamkonda development) సమీక్షించనున్నారు. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం, జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధిపై ఆరా తీయనున్నారు. జంట నగరాల్లో రైల్వే ట్రాక్‌లపై ఆర్‌వోబీల నిర్మాణంపై సమీక్షించనున్నారు.
వరంగల్ ఇంటర్నల్ రింగ్‌రోడ్ పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి అవసరమైన పనులు మంజూరు చేయనున్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు పనుల పురోగతిపైనా చర్చించనున్నారు. హనుమకొండ జిల్లా తెరాస కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు ప్రారంభిస్తారు.
ఇదీ చదవండి:Minister KTR : 'విమర్శలు చేయడం సులభం.. సేవ చేయడమే కష్టం'