KCR Warangal Tour: అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని మంత్రిమండలికి అధికారులు వెల్లడించారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని వివరించారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు కేంద్రాల కొనసాగించాలని కేబినెట్ ఆదేశించింది.
KCR Warangal Tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - తెలంగాణ కేబినెట్ భేటీ
16:43 January 17
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
వడగళ్ల వాన వల్ల పంట నష్టం
Warangal Rains :ఇటీవల వరంగల్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పడిన వర్షం వల్ల జిల్లాలో మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, టేకుమట్ల, మహదేవపూర్, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రైతులతో మాట్లాడి... తగిన భరోసా ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి :పలు జిల్లాల్లో అకాల వర్షం... మిగిల్చింది తీరని నష్టం