CM KCR Speech at Narsampet Praja Ashirvada Sabha :అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల చరిత్ర కూడా చూడాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజలే గెలవాలని సూచించారు. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రతి పక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రంలో పారుతున్నా.. నీళ్ల కరువు ఉండేదన్నారు. గతంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందని ప్రజలను అడిగారు.
Narsampet BRS Praja Ashirvada Sabha :ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే గత ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పానన్నారు. మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదని విమర్శించారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు నీటి తీరువా పన్నులు రద్దు చేశామని చెప్పారు. 7500 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని వివరించారు.
CM KCR Comments on Telangana Leaders :రైతుబంధు ద్వారా ప్రజల డబ్బు వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు(Telangana Congress Leaders) అంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసమే ధరణి పోర్టల్ తెచ్చామన్నారు. ధరణి పోర్టల్ తెచ్చాక వీఆర్‌వో, ఎమ్మార్వోల బాధలు తొలగాయని తెలిపారు. ధరణి పోర్టల్ వల్లే రైతులకు అన్ని డబ్బులు సకాలంలో చేరుతున్నాయన్నారు. ధరణి లేకుంటే రైతులకు రైతుబంధు(Rythu Bandhu) ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే.. 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనాడూ రైతుల గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు.
విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్