రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని... ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వరంగల్ కలెక్టరేట్ నుంచి అన్ని కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోనే ఉన్న సెంట్రల్ జైల్‌ను తరలించి... అక్కడ అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ దవాఖానాను నిర్మిస్తామని తెలిపారు. చర్లపల్లి తరహాలో వరంగల్‌లో కొత్తగా ఓపెన్ ఎయిర్ జైలు నిర్మిస్తామన్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై అధికారుల్ని ఆరా తీశారు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లపై ఉందని స్పష్టంచేశారు. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు కావడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. సడలింపు సమయం తప్ప... మిగతా 20 గంటలు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత తర్వాత పాస్ హోల్డర్స్ తప్పా... మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోందని... పట్టణాలు, నగరాల్లో ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలన్నారు.
ఆ జిల్లాల్లో కేసులు తగ్గడం లేదు