CM KCR Election Campaign Today :ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లు పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గపు పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం మహబూబాబాద్ రోడ్లోని సభాస్థలిలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. కేసీఆర్ పర్యటన(CM KCR Election Campaign)ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సభకు దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరవుతారని బీఆర్ఎస్(BRS) అంచనా వేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, నర్శంపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న సభ ఈ జిల్లాలో ఐదోది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం.. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొననున్నారు. అలాగే దీపావళి తర్వాత సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారాలు