సమాజానికి మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడూ ఇట్లజేయడు. అసత్య ప్రచారాలు మానుకోవాలే. దీంట్ల ఉన్న పెద్ద కథేందంటే నాకు వచ్చిపాడైంది కరోనా. నాకొస్తే నేను డాక్టర్ అని అడిగిన నువ్వు ఇమాందారిగా చెప్పు... ఈ బీమారి ఏందో దొరికిందా అని. మీరు ఇచ్చే మందులేంది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ సర్ అన్నడు. మొన్న చీఫ్ జస్టిస్ వచ్చిండుగా ఆయన చెప్పిండని వాళ్ల సుట్టానికి ఇయ్యగూడని మందులన్నీ ఇచ్చిండ్రు. ఆ పిల్లగాడు ఇంత దొడ్డుగా బలిసుండు. ఇదంతా ఆయనే చెప్పిండు. నేను ఏందీ ఇదంతా అని డాక్టర్ అని అడిగిన. ఏం లేదు సర్ రోగులను చూస్తున్న కద సర్ నాకే వచ్చింది ఈ కరోనా. మరి ఎట్లనయ్యా నాగ్గూడా ఆ సూదులిస్తే ముందే నాది బక్కపానం అన్న. ఏం లేదు సర్ దీనికి రెండే రెండు గోళీలు... జ్వరం బాగా వస్తది అది తగ్గియడానికి పారాసిటమాల్ లేకుంటే డోలో. రెండోది యాంటీ బయోటిక్. మంచిగ తినమన్నరు తిన్న. వారం రోజుల్లో ఇవే వాడిన వారం రోజుల్లో తగ్గిపోయింది కరోనా. దీనికి ఇన్ని కథలా. ఇంత దుష్ప్రచారామా?
KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది - Kcr warangal tour
అసత్య ప్రచారాలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్... టీవీ ఛానెళ్లు, వార్తపత్రికలకు సూచించారు. కరోనా వైరస్, ఇతర వాటిపైన దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తామేం చెప్పాలనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్
-- ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీచూడండి:KCR: వరంగల్లో కేసీఆర్.. కలెక్టరేట్ ప్రారంభం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ