ఉత్తర తెలంగాణకు పెద్దదికైనా ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ములుగు శాసన సభ్యురాలు సీతక్కతో కలిసి ఆయన ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పలువిభాగాలను కాంగ్రెస్ నేతలు సందర్శించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఆసుపత్రి పర్యవేక్షణాధికారి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. కృతిమ శ్వాసను అందించే వెంటిలేటర్ల కొతర వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని సూచించారు.
'ఎంజీఎంలో వైద్యుల కొరతను పరిష్కరించాలి' - MGM Hospitol in Warngal
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సందర్శించారు. నిమ్స్ స్థాయిలో ఎంజీఎంను అభివృద్ధి పరుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంజీఎంలో సమస్యలను పరిష్కరించాలి