వరంగల్ అర్బన్ జిల్లాలో కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ప్రసాదాలు అందించేందుకు పర్యావరణ సహిత సంచులను వాడనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి కలెక్టర్ జీవన్ పాటిల్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లో జ్యువెలర్స్ షాప్ యజమానులు పర్యావరణ సహిత సంచులను బహుకరించగా... వాటిని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ప్రారంభించారు.
ప్రసాద పంపిణీకి పర్యావరణహిత సంచులు - CLOTH BAGS IN KOTHAKONDA FESTIVAL
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి కలెక్టర్ జీవన్ పాటిల్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగే కొత్తకొండ జాతరలో పర్యవరణహిత సంచుల్లో ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ప్రారంభించారు.
CLOTH BAGS IN KOTHAKONDA FESTIVAL
వీరభద్ర స్వామి వారికి బంగారంతో చేయించిన రుద్రాక్షమాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ రహిత సంచులను అందించిన వ్యాపారస్థులను ఎమ్మెల్యే అభినందించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా ప్రసాదాల పంపిణీకి ఇలాంటి సంచులను ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్