జాతీయ కాంగ్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు - హన్మకొండ తాజా వార్తలు
జాతీయ కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగి హంగామా సృష్టించారు. ఒకరినొకరు నెట్టివేసుకుంటూ బాహాబాహీకి దిగారు.
కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు
అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. యువజన కాంగ్రెస్ నాయకులు రమాకాంత్‌రెడ్డి, తోట పవన్ వర్గీయుల మధ్య ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరితో ఒకరు బాహాబాహీకి దిగి.. కొట్టుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు నానా హంగామా చేశారు. ఘటనలో ఓ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలు కుర్చీలు విరిగిపోయాయి. అనంతరం ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీచూడండి: 'కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు త్వరలోనే అధిగమిస్తాం'
Last Updated : Aug 9, 2020, 12:38 PM IST
TAGGED:
హన్మకొండ తాజా వార్తలు