CJI NV Ramana Tour:ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు పర్యటించిన.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్యాధునిక సదుపాయాలు,సంస్కరణలకు శ్రీకారం చుడుతూ సర్వాంగ సుందరంగా హనుమకొండలో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని..ఆయన ప్రారంభించారు. తన మానసపుత్రికగా భావించి జస్టిస్ పి.నవీన్‌రావు కోర్టును అధునీకరించారని సీజేఐ అభినందించారు.
మౌలిక వసతులు కల్పించాలి
CJI on court facilities: శిథిలావస్ధకు చేరుకున్న కోర్టులను బాగుచేయాల్సిన అవసరం ఉందన్న సీజేఐ.. న్యాయస్ధానాలకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన కోసం ఓ సంస్ధను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయవాదుల ఇబ్బందులు తొలగాలంటే మొబైల్ నెట్ వర్కింగ్ సిస్టమ్ ఏర్పాటే పరిష్కారమని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం
CJI on courts: కోర్టుల ఆధునికీకరణకు కేంద్రం నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని సీజేఐ ఆకాక్షించారు. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని రాష్ట్రాల నుంచి సహకారం కొరవడిందని ఆక్షేపించారు. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చక్కని తోడ్పాటు ఇస్తోందని ప్రశంసించారు. న్యాయవాద వృత్తికి ఎంతో గౌరవం ఉందని చెపుతూ వృత్తి, కుటుంబమన్నదే కాకుండా సామాజిక బాధ్యతనూ న్యాయవాదులు విస్మరించకూడదని హితవు పలికారు.
మాతృభాషను ప్రేమించండి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ CJI on mother tounge:మాతృభాషను ప్రేమించండన్న సీజేఐ ఘనమైన మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అలవాటు చేయాలని సూచించారు.. చారిత్రక వరంగల్ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చదివి వినిపించిన కవిత అందరిని ఉత్సాహపరిచారు. వరగంల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు భద్రకాళీ అమ్మవారు, హన్మకొండలోని వెయ్యిస్తంభాల ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి: