"మాది వరంగల్ జిల్లా.. మా నాన్న కృష్ణం రాజు.. స్థానికంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మ గృహిణి. ఎన్ఐటీ రాయ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత రెండేళ్లు ఉద్యోగం చేశాక.. ఇక సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించాను. మొదటిసారి రాసినప్పుడు ప్రిలిమ్స్ కొట్టలేకపోయాను. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వచ్చి ఫెయిలయ్యాను. మూడోసారి గెలుపు సాధించాను. ఈ ప్రయాణంలో తప్పులను సరిదిద్దుకొని పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డాను. ప్రతి దశలోనూ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ ముందుకు సాగాలి. ఎంత సేపు చదివాం అనే దాని కంటే.. చదివిన సమయంలో ఎంత బాగా నేర్చుకున్నాం అనేది చాలా ముఖ్యం." -రంజిత్ కుమార్, సివిల్స్ 574 వ ర్యాంకర్
'మా నాన్న రైతు. అమ్మ అంగన్వాడీ టీచర్. నేను వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నా. 2020లో నా గ్రాడ్యుయేషన్ పూర్తైంది. నేను 8 వ తరగతిలో ఉన్నప్పుడే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించాను. 2017లో ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ప్రతి రోజూ వర్తమాన వ్యవహారాలు అనుసరిస్తూ వచ్చాను. రోజూ 5,6 గంటల పాటు చదువుకుంటూ.. కాలేజీకి వెళ్తూ.. రాత్రిళ్లు మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఏడాదిన్నర క్రితం పూర్తిగా సివిల్స్‌పైనే ధ్యాస పెట్టాను. అంకిత భావం, నిరంతర కృషి ఈ రెండే నా విజయానికి సూత్రాలు.' -శరత్ నాయక్, సివిల్స్ 374 వ ర్యాంకర్