వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2020 పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పరీక్షల ఏర్పాట్లు, ప్రశ్న పత్రాల ఓపెన్ విధానాన్ని పరిశీలించారు. ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 49.3 శాతం హాజరు - warangal urban civils priliminary
జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లలో 6,758 మందికి 49.3 శాతం మాత్రమే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పరీక్షార్థుల కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
![సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 49.3 శాతం హాజరు civils exam centers visited by warangal urban district collector rajeev gandhi hanumanthu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9045477-391-9045477-1601806056406.jpg)
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 49.3 శాతం హాజరు
16 సెంటర్లకు 6,758 మంది అభ్యర్థులను కేటాయించగా.. 3,330 మంది హాజరయ్యారని, 3,428 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.