సివిల్స్ ఫలితాల్లో వరంగల్ యువకులు సత్తా చాటారు. హన్మకొండలోని సహకర్ నగర్‌కు చెందిన సాయి తేజ 344 ర్యాంకు సాధించగా.. పోస్టల్ కాలనీకి చెందిన స్మృతిక్ 466వ ర్యాంక్ సాధించారు. సాయి తేజ హన్మకొండలో పదో తరగతి వరకూ చదవగా... హైదరాబాద్‌లో ఇంటర్ విద్య పూర్తి చేసి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌ను అభ్యసించాడు. ఐఐటీ చివరి సంవత్సరం నుంచి సివిల్స్ ప్రిపేర్ అయినట్లు సాయితేజ తెలిపారు. ఆయనకు చిన్నతనం నుంచి సివిల్స్ అంటే ఆసక్తి ఉండటం వల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్లు సాయి తేజ వివరించారు. 466వ ర్యాంకు సాధించిన స్మృతిక్ ప్రస్తుతం భూపాల్ సెంట్రల్ ఆర్మూర్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్నారు.
సివిల్స్‌లో మెరిసిన హన్మకొండ యువకులు - union public service commission
దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే... సివిల్స్ ఫలితాల్లో వరంగల్ యువకులు సత్తా చాటారు. అద్భుతమైన ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించారు. హన్మకొండకు చెందిన సాయితేజ 344 ర్యాంకు సాధించగా... పోస్టల్ కాలనీకి చెందిన స్మృతిక్ 466వ ర్యాంక్ సాధించారు.
సివిల్స్‌లో మెరిసిన హన్మకొండ యువకులు