తెలంగాణ

telangana

సత్ఫలితాలనిస్తోన్న సిటిజన్ ట్రాకింగ్ యాప్

By

Published : Apr 11, 2020, 1:01 PM IST

పోలీస్ శాఖ నూతనంగా రూపొందించిన సిటిజన్ ట్రాకింగ్ యాప్ సత్ఫలితాలనిస్తోంది. వరంగల్ నగరంలో రెండు రోజుల వ్యవధిలో పెద్ద మొత్తంలో వాహనాలను సీజ్ చేయడం ద్వారా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

Citizen Tracking App
సత్ఫలితాలనిస్తోన్న సిటిజన్ ట్రాకింగ్ యాప్..

వరంగల్ నగరంలో లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. రెండు రోజులుగా అధికారులు తీసుకున్న చర్యలు ఫలించడం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య తగ్గింది. అనవసరంగా రోడ్డెక్కిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం వల్ల ఓరుగల్లు వాసులు రోడ్డు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

అత్యవసర సమయంలో తప్ప నగరవాసులు ఇంటిని వదిలి బయటకు రావడం లేదు. పోలీస్ శాఖ నూతనంగా రూపొందించిన సిటిజన్ ట్రాకింగ్ యాప్ సత్ఫలితాలనిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో పెద్ద మొత్తంలో వాహనాలను సీజ్ చేయడం ద్వారా నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇవీచూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details