క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో హన్మకొండలోని సెంటినరీ బాపిస్టు చర్చ్, క్యాథడ్రల్ చర్చ్‌లు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.
క్రిస్మస్ శోభ: వేడుకల కోసం అందంగా ముస్తాబైన చర్చిలు - warangal district latest news
క్రైస్తవ సోదరులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే చర్చిలను అందంగా ముస్తాబు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నగరంలోని చర్చ్‌లన్నీ విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి.

క్రిస్మస్ శోభ: వేడుకల కోసం అందంగా ముస్తాబైన చర్చిలు
సంవత్సరానికి వచ్చే ఒకే ఒక్క పండుగ కావడం వల్ల క్రైస్తవ సోదరులంతా కలిసి తమ తమ ప్రాంతాల్లోని చర్చిలను అందంగా ముస్తాబు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా.. సంతోషకర వాతావరణంలో వేడుకను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకోనున్నారు.