తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేం స్పందిస్తే.. మీ పార్టీకి అతీగతీ ఉండదు' - hanmakonda latest news

హన్మకొండలో నిర్వహించిన ప్రజా సంక్షేమ యాత్రలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్​భాస్కర్​ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే నివాసంపై భాజపా శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా​ ఖండించారు. దమ్ముంటే ప్రజలకు మధ్యకు వచ్చి చర్చ పెట్టాలి కానీ.. ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు.

chip vip vinay bhaskar fire on bjp activists
chip vip vinay bhaskar fire on bjp activists

By

Published : Feb 1, 2021, 6:35 PM IST

'మేం స్పందిస్తే... మీ పార్టీకి అతీగతి ఉండదు'

భాజపా శ్రేణులపై ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ మండిపడ్డారు. "మా ఓపికను పరీక్షించొద్దు.. మేం గనక స్పందిస్తే.. మీరు గానీ, మీ పార్టీకి గానీ అతీగతీ ఉండదు" అని హెచ్చరించారు. హన్మకొండలో ప్రజా సంక్షేమ యాత్రలో పాల్గొన్న వినయ్​భాస్కర్​.. పరకాల ఎమ్మెల్యే నివాసంపై భాజపా శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా​ ఖండించారు.

సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ఓర్వలేని భాజపా నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అలజడి రేపుతున్నారని మండిపడ్డారు. తాము మౌనంగా ఉన్నామనుకోవద్దని హెచ్చరించారు. దమ్ముంటే ప్రజలకు మధ్యకు వచ్చి చర్చ పెట్టాలి కానీ.. ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details