తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ రైల్వేస్టేషన్​లో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ - Child Line Help Desk at Warangal Railway Station

వరంగల్​ రైల్వేస్టేషన్​లో తరుణీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ని కలెక్ట్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ తప్పిపోయిన చిన్నారుల బాధ్యత తీసుకోవాలని కోరారు.

child-line-help-desk-at-warangal-railway-station

By

Published : Aug 8, 2019, 8:05 PM IST

తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించటంతో పాటు వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని వరంగల్ పట్టణ కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ స్పష్టం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్​లో తరుణీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ను పోలీస్ కమిషనర్ రవీందర్​తో కలిసి ప్రారంభించారు. నిర్వాహకులు చిన్నారులను గుర్తించడంతో ఆగకుండా వారికి మంచి ఆశ్రయం కల్పించాల్సిందిగా సూచించారు. 2015లో దేశవ్యాప్తంగా 20 రైల్వే స్టేషన్లలో చైల్డ్ లైన్ డెస్కులను ఏర్పాటు చేయగా... ప్రభుత్వం సహకారంతో వాటి సంఖ్య 512కు చేరాయని నిర్వాహకులు తెలిపారు.

వరంగల్​ రైల్వేస్టేషన్​లో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details