కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డేపెల్లిలో పోచమ్మ దేవాలయాన్ని వినయ్ భాస్కర్ సందర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పోచమ్మ బోనాలను సామూహికంగా చేయకుండా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
'పోచమ్మ బోనాలను ఇళ్లలోనే జరుపుకోండి' - bonal festival news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డేపెల్లిలో పోచమ్మ దేవాలయాన్నిఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సందర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పోచమ్మ బోనాలను సామూహికంగా చేయకుండా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
!['పోచమ్మ బోనాలను ఇళ్లలోనే జరుపుకోండి' chif cip vinay bhasker comment about pochamma bonalu in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8269463-228-8269463-1596371495035.jpg)
chif cip vinay bhasker comment about pochamma bonalu in warangal
రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను సమకూరుస్తుందన్నారు. బయట తిరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని వినయ్ భాస్కర్ కోరారు.