తెలంగాణ

telangana

ETV Bharat / state

మాంసం విక్రయ దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వరంగల్​ నగరం అభివృద్ధికి దూరమైందని ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​ విమర్శించారు. వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేటలోని జూబ్లీ మార్కెట్​లో నిర్మించిన మాంసం విక్రయ దుకాణాలను ఆయన ప్రారంభించారు.

chief whip vinaybhaskar open meat market in warangal urban district
మాంసం విక్రయ దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Jul 1, 2020, 2:34 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట జూబ్లీ మార్కెట్​లో 30 లక్షల రూపాయల నిధులతో నూతనంగా మాంసం విక్రయ దుకాణాలను నిర్మించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ దుకాణాలను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. అనంతరం పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్​లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ నగరం అభివృద్ధికి దూరమైందని వినయ్​భాస్కర్​ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

పెరిగిన జనాభాకు అనుగుణంగా 30 లక్షలతో మార్కెట్​ని​ తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు. రహదారుల పక్కన కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులందరికీ కూరగాయల మార్కెట్​లో స్థలాలు కేటాయించామని తెలిపారు. ప్రధాన రహదారుల పక్కన కూరగాయలు అమ్ముతున్న చిరు వ్యాపారుల వల్ల ట్రాఫిక్​కు ఇబ్బందులు కలగడంతో పాటుగా అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. కావున అందరూ మార్కెట్​లో తమకు కేటాయించిన స్థలంలోనే కూరగాయలు అమ్మాలని చీఫ్ విప్ వినయ్​భాస్కర్​ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి: గుత్తా సుఖేందర్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details