అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను వినయభాస్కర్ పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్
హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అందజేశారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు.
సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్
చెక్కులతో పాటు మొక్కలను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే సర్కారు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'సార్.. నా సమస్యను పరిష్కరించండి.. అదనపు కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు