తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది' - review meeting on corona with district health officers at hanmakonda

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్​ నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

chief Whip Vinaya Bhaskar conduct review meeting on corona
'కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది'

By

Published : Jul 30, 2020, 2:56 PM IST

వరంగల్​ నగరంలోని 14 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ తెలిపారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

కొవిడ్ ​పాజిటివ్​గా వచ్చిన వాళ్లు ఆందోళన చెందొద్దన్నారు. వారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్‌ అందజేస్తున్నదని చెప్పారు. నగరంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హన్మకొండలో.. జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని చీఫ్ విప్ పేర్కొన్నారు. బాధితులు అధైర్య పడకుండా 17 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. వైద్యులు ఇచ్చిన మందులు వాడితే కొవిడ్​ వ్యాధి నయం అవుతుందని వివరించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details