హన్మకొండ వడ్డేపల్లిలోని పలు కాలనీల్లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పర్యటించారు. కాలనీల్లో నెలకొన్న పలు సమస్యల గురించి కార్పొరేటర్ శ్రవణ్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా వంగిన, తుప్పు పట్టిన, బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలను ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ గమనించారు. వీటిని వీలైనంత త్వరగా తొలగించి.. కొత్తవి ఏర్పాటు చేయాలని, వేలాడే వైర్లను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గత వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు నేలకొరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని వాటిని సత్వరమే తొలగించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
హన్మకొండ పట్టణంలో పర్యటించిన చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ - Chief Whip Vinay Bhaskar visited Hanmakonda town
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హన్మకొండ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు. వర్షాల కారణంగా విరిగిన, వంగిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కాలనీల్లోని సమస్యలను కార్పొరేటర్లు పరిష్కరించాలని ఆదేశించారు.
హన్మకొండ పట్టణంలో పర్యటించిన చీఫ్ విప్ వినయ్‌భాస్కర్
రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల పరిశుభ్రతకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లోని సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆక్రమణలను తొలగించి, ఖాళీ ఇళ్ల స్థలాల్లో పిచ్చిమొక్కలు, అపరిశుభ్రంగా ఉంటే సంబంధిత యజమానులకు పరిశుభ్రం చేయించేలా నోటీసులు జారీ చేయాలన్నారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చేపట్టిన పనులను పరిశీలిస్తామన్నారు.
ఇవీ చూడండి: 'మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది'