జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంపై సమావేశంలో చర్చించారు. తెరాస తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని సూచించారు.
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: ప్రభుత్వ చీఫ్ విప్ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
![గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: ప్రభుత్వ చీఫ్ విప్ chief whip vinay bhaskar review on ghmc elections in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9608473-114-9608473-1605882649725.jpg)
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: ప్రభుత్వ చీఫ్ విప్
అంకితభావంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్